హైదరాబాద్‌లో బిర్యానీ లవర్స్‌కు షాక్..3 రోజుల నాటి బిర్యానీని వేడి చేసి సరఫరా (video)
హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో కుళ్లిన బిర్యానీని ఆన్లైన్ ద్వారా సరఫరా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో బిర్యానీ లవర్స్‌కు షాక్..3 రోజుల నాటి బిర్యానీని వేడి చేసి సరఫరా (video)
హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో కుళ్లిన బిర్యానీని ఆన్లైన్ ద్వారా సరఫరా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు హోటల్ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని వెంకటరమణ కాలనీలో నివసించే కొండారెడ్డి ఆదివారం ఉదయం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు.
అదే ప్రాంతంలో ఉన్న లక్కీ బిర్యానీ షవర్మ రెస్టారెంట్ నుంచి డెలివరీ అయిన బిర్యానీ పొట్లం తెరిచి చూడగా తీవ్ర దుర్వాసన రావడంతో పాటు బిర్యానీ కుళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హోటల్‌లో తనిఖీలు నిర్వహించగా ఫ్రిడ్జ్‌లో సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
జీడిమెట్లలో మూడు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీని ప్యాకెట్లుగా చేసి ఇక్కడి అవుట్‌లెట్‌లో భద్రపరుస్తూ, ఆర్డర్ వచ్చినప్పుడు ఓవెన్‌లో వేడి చేసి కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇంకా హోటల్‌లో పరిశుభ్రత పూర్తిగా లేకపోవడం, ఫ్రిడ్జ్‌లో ఎలుకలు తిరుగుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హోటల్ యజమాని ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసి హోటల్‌ను సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హోటల్‌లో తనిఖీలు చేపట్టగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#Hyderabad:#Rottenbiryani row in #BanjaraHillsA city-based resident received #foul-smelling, #spoiledchicken biryani via an #online app and filed a complaint. #Police found 80 #packets stored at a local outlet, cooked 3 days earlier in #Jeedimetla, reheated, and delivered.… pic.twitter.com/buCxIjxHve
— NewsMeter (@NewsMeter_In) April 7, 2026