ఆ డేటా అంతా సేఫే..నాంపల్లి FSL ప్రమాదంపై శిఖా గోయెల్ స్పందన
నాంపల్లి ఎఫ్‌ఎస్‌ఎల్ క్యాంపస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో హై ప్రొఫైల్ కేసుల్లో కీలకమైన ఆధారాలు నాశనమయ్యాయనే ఆరోపణలను శిఖా గోయెల్ తోసిపుచ్చారు.
By - Knakam Karthik |
ఆ డేటా అంతా సేఫే..నాంపల్లి FSL ప్రమాదంపై శిఖా గోయెల్ స్పందన
హైదరాబాద్: నాంపల్లి ఎఫ్‌ఎస్‌ఎల్ క్యాంపస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో హై ప్రొఫైల్ కేసుల్లో కీలకమైన ఆధారాలు నాశనమయ్యాయనే ఆరోపణలను తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టిజిఎఫ్‌ఎస్‌ఎల్) డైరెక్టర్ శిఖా గోయెల్ తోసిపుచ్చారు. అన్ని కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలు, సామగ్రి ఇప్పటికే సురక్షితంగా ఉన్నాయని సంఘటన జరగడానికి చాలా కాలం ముందే కోర్టులకు సమర్పించబడిందని ఆమె స్పష్టం చేశారు.
అగ్నిప్రమాద బాధిత ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన శిఖా గోయెల్..శనివారం ఉదయం 10:08 గంటలకు మంటలు చెలరేగాయని, ఎఫ్‌ఎస్‌ఎల్ ఉద్యోగి మొదట గమనించారని, వెంటనే సీనియర్ పోలీసు అధికారులకు సమాచారం అందించారని చెప్పారు. ఉదయం 10:30 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని చెప్పారు.
ప్రమాదంలో 2015లో నమోదైన ఓటుకు నోటు కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి, అలాగే కొన్ని కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు అని, వాటిలో నిజం లేదని, అలాంటి ప్రచారాలను ఎవరు నమ్మరాదని స్పష్టం చేశారు. 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన ఓటుకు నోటు కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయని తెలిపారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021 లో ఏసీబీ కోర్టుకు పొందపరిచామని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని వెల్లడించారు.ఇక్కడ ఆధారాలు కాలిపోయిన ఏసీబీ దగ్గర ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఈకేసులో ఆధారాలకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం జరుగలేదని తేల్చారు.
అలాగే 2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి వచ్చాయి అని, మిగతా మెటీరియల్ అసిస్ట్ చేశాం అని, ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి అని తెలిపారు. వీటిని రిట్రివ్ చేస్తాం అని స్పష్టం చేశారు. ప్రమాదంపై విచారణ జరుగుతుంది అని తెలిపారు. ప్రమాదంలో ఇంత వరకు ఎంత నష్టం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు అని, ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
మంటలు ఎఫ్‌ఎస్‌ఎల్ భవనంలోని ప్రయోగశాల ప్రాంతాలు, శిక్షణా హాలు, లైబ్రరీ, హెచ్‌ఆర్‌డి గదితో సహా కొన్ని భాగాలకు వ్యాపించాయని ఆమె చెప్పారు. అధికారులు ప్రస్తుతం ఆస్తి నష్టం ఎంతవరకు జరిగిందో అంచనా వేస్తున్నారు, పోలీసులు కేసు నమోదు చేసి, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
#Hyderabad:No #crucialevidence destroyed in #Nampallyfire, says #Telangana forensic lab director @Shikhagoel_IPS A #fire broke out at the Computer Forensic Lab, TGFSL, Nampally, at 10:08 am on Feb 7. Staff responded swiftly, fire alarms were activated, and the Fire Dept… pic.twitter.com/d7RZZYW7aZ
— NewsMeter (@NewsMeter_In) February 8, 2026