అప్సర హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Shamshabad Apsara Murder Case. శంషాబాద్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By Medi Samrat Published on 9 Jun 2023 6:15 PM ISTశంషాబాద్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి వెంకట సాయి కృష్ణ ఈ హత్య చేసినట్లు నిర్థారించారు పోలీసులు. శంషాబాద్‌లో హత్య చేసి, కారులో డెడ్ బాడీనీ సరూర్ నగర్ డంప్ చేసి.. సరూర్‌నగర్ లోని మ్యాన్ హోల్‌లో పడేశాడు. గుట్టు బయటపడకుండా ఉండేందుకు మ్యాన్ హోల్ కు కాంక్రీట్ వేశాడు. నిందితుడు సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అప్సర డెడ్ బాడీని వెలికి తీశారు.
మే 3న అప్సరతో కలిసి బయటకు వెళ్లిన సాయికృష్ణ హత్యకు ప్లాన్ చేశాడు. అప్సరకు ట్యాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి దించి, ఆ తర్వాత బండరాయితో మోది చంపినట్లు విచారణలో బయటపడింది. హత్య నుంచి బయటపడేందుకు ఈనెల 5న శంషాబాద్ పీఎస్‌కి వెళ్లి మేనకోడలు మిస్సింగ్ అంటూ తప్పుడు కంప్లైంట్ చేశాడు. పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు సాయికృష్ణ. అప్సర తమ బంధువు కాదని, ఆమెను ఒకసారి గుడిలో చూసి హెచ్చరించానని చెప్పారు సాయికృష్ణ తండ్రి. మూడు నెలలుగా తమ కొడుకుని వేధించడంతో హత్య చేసి ఉండవచ్చని అన్నారు.
పూజారి సాయికృష్ణను ఉరితీయాలని డిమాండ్ చేసింది అప్సర తల్లి. కోయంబత్తూర్ కు వెళుతున్నామని తీసుకెళ్లి హత్య చేశాడని చెప్పారు అప్సర తల్లి. మా ఇంటికి వచ్చి భోజనం పెడతారా? అని అడిగేవాడని తెలిపింది. అక్కయ్యగారు అంటూ అప్పుడప్పుడు ఇంటి వచ్చేవాడు. పూజారి ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు. చుట్టుపక్కల అన్నదానం చేస్తూండేవాడు. మంచివాడని అందరూ అనుకునేవాళ్లని తెలిపింది. మా అమ్మాయి పదేళ్ల క్రితం ఓ తమిళ సినిమాలో నటించింది. మేము కొన్నేళ్ల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చామని అప్సర తల్లి చెప్పుకొచ్చింది.