రోడ్డు నెం.12, బంజారాహిల్స్‌.. స్పా ముసుగులో

Sex racket running in garb of spa busted in Hyderabad, 8 women rescued. హైదరాబాద్‌లోని రోడ్డు నెం.12 బంజారాహిల్స్‌లో స్పా ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠా గుట్టును

By M.S.R  Published on  11 March 2022 7:42 AM GMT
రోడ్డు నెం.12, బంజారాహిల్స్‌.. స్పా ముసుగులో

హైదరాబాద్‌లోని రోడ్డు నెం.12 బంజారాహిల్స్‌లో స్పా ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పా నిర్వాహకులతో సహా నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు ఎనిమిది మంది మహిళలను రక్షించి సఖి కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌కు చెందిన పోలీసు బృందం బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని స్పాపై దాడి చేసి, మసాజర్‌లుగా పనిచేస్తున్న మహిళలను యాజమాన్యం వ్యభిచారంలోకి దింపుతున్నట్లు గుర్తించింది.

ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షితులను చేసిన స్పా నిర్వాహకులు.. మహిళలను వ్యభిచార రొంపిలోకి దించి రూ.3,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నట్టు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివ చంద్ర తెలిపారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ పార్లర్లు, స్పాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని బోవెన్‌పల్లి, నారాయణగూడ, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించి వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళలను రక్షించారు.

Next Story