సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ పరిస్థితి ఎలా ఉందంటే?

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన జరిగి 50 రోజులు దాటినా ఆ స్పృహతప్పి పడిపోయిన బాలుడు శ్రీతేజ ఇప్పటికీ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

By అంజి
Published on : 30 Jan 2025 10:00 AM IST

Sandhya theater stampede, health condition, Sriteja, Hyderabad, Pushpa2

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ పరిస్థితి ఎలా ఉందంటే? 

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన జరిగి 50 రోజులు దాటినా ఆ స్పృహతప్పి పడిపోయిన బాలుడు శ్రీతేజ ఇప్పటికీ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ పూర్తిగా కోలుకోలేదని వైద్యులు తెలిపారు.

తాజా హెల్త్ అప్‌డేట్ ప్రకారం, ఎనిమిదేళ్ల చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉంది. బాగా స్పందిస్తున్నాడు. అయితే అతడికి ముక్కులోని ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. "సాయి తేజ ఇప్పుడు మరింత మెలకువగా ఉన్నాడు. కానీ అతను ఇప్పటికీ తన కుటుంబాన్ని గుర్తించలేకపోతున్నాడు" అని ఆసుపత్రిలో అతని చికిత్సను పర్యవేక్షిస్తున్న వైద్యులు చెప్పారు.

ఈ సంఘటన డిసెంబర్ 4న రాత్రి జరిగింది, పుష్ప 2 స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో శ్రీ తేజ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నిందితుడైన నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. శ్రీతేజ కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ ప్రకటించారు.

Next Story