బైక్ మీద వెళుతున్నారు.. హైదరాబాద్ పోలీసులు పట్టుకోడానికి ప్రయత్నించగా!!

హైదరాబాద్ నగరంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాడు భారీగా హవాలా డబ్బు పట్టుబడిందని అధికారులు తెలిపారు.

By అంజి  Published on  2 Oct 2024 11:00 AM IST
Hawala Money Seized, Hyderabad, Sulthan Bazar

బైక్ మీద వెళుతున్నారు.. హైదరాబాద్ పోలీసులు పట్టుకోడానికి ప్రయత్నించగా!! 

హైదరాబాద్ నగరంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాడు భారీగా హవాలా డబ్బు పట్టుబడిందని అధికారులు తెలిపారు. బైక్‌ మీద వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపగా ఈ డబ్బు పట్టుబడింది. హనుమాన్ టేకిడి వద్ద సుల్తాన్ బజార్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. వారి దగ్గర నుండి రూ.1.21 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మొదట పోలీసు పార్టీ వారిని ఆపడానికి ప్రయత్నించగా వారు తప్పించుకోగలిగారు. కోటి వద్ద వారిని పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పోలీసులు బైకర్లను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

పట్టుకున్న వ్యక్తులను రాజస్థాన్ కు చెందిన లక్ష్మణ్ (27), వసంత్ (24)గా గుర్తించారు. మొదట వారి వద్ద ఉన్న బ్యాగులో కోటి రూపాయలు ​దొరికింది. వారిచ్చిన సమాచారంతో హనుమాన్ వ్యాయామశాల సమీపంలోని ఓ అపార్ట్​మెంట్ లో తనిఖీలు చేయగా అక్కడ రూ.21లక్షలు దొరికాయి. తరుణ్ అనే వ్యక్తిని విచారించగా ముంబైలో ఉండే బబ్లూ అనే హవాలా వ్యాపారి కోసం తాము పనిచేస్తున్నామని ఒప్పుకున్నాడు.

Next Story