హైదరాబాద్: మ్యాన్‌హోల్ నుంచి ఎర్రటి నీరు ఒక్కసారిగా బయటకు వచ్చి వరదలా ప్రవహించింది. ఎర్రటి నీరు చూసేందుకు అచ్చం రక్తం మాదిరిగానే ఉంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రటి నీరు వెంకటాద్రి నగర్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడ సమీపంలోని సుభాష్‌నగర్ డివిజన్‌లో నవంబర్ 25వ తేదీ సోమవారం సాయంత్రం మ్యాన్‌హోల్ నుంచి ఒక్కసారిగా ఎర్రటి నీరు ఉబికి రావడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఈ అసాధారణమైన ఎర్రటి నీరు రెండు వీధుల గుండా ప్రవహించింది. దీంతో చాలా మంది స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. సమీపంలోని గిడ్డంగుల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీ వ్యవస్థలోకి డంప్ చేయడం వల్ల ప్రమాదకరమైన సంఘటన జరిగిందని నివాసితులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానిక అధికారులు విచారణ జరిపి ఇలాంటి ప్రమాదకర వ్యర్థపదార్థాలు పారవేసే పద్ధతులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.