Secunderabad Cantonment: 9 ఏళ్ల నిరీక్షణకు తెర.. తెరుచుకున్న కంటోన్మెంట్‌ రోడ్లు

స్థానిక మిలిటరీ అథారిటీ (LMA) తన పంతాన్ని ఎట్టకేలకు విరమించుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, పరిసర ప్రాంతాల పౌర జనాభాకు గతంలో

By అంజి
Published on : 1 May 2023 8:23 AM IST

Secunderabad Cantonment Board , Hyderabad, Local Military Authority

Secunderabad Cantonment: 9 ఏళ్ల నిరీక్షణకు తెర.. తెరుచుకున్న కంటోన్మెంట్‌ రోడ్లు

హైదరాబాద్: స్థానిక మిలిటరీ అథారిటీ (LMA) తన పంతాన్ని ఎట్టకేలకు విరమించుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, పరిసర ప్రాంతాల పౌర జనాభాకు గతంలో నిషేధించబడిన ఆరు కీలకమైన మార్గాలలో ఐదింటిని తిరిగి తెరిచింది. ఈ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయం ఈ కీలక రోడ్డులకు అడ్డంకులు లేని యాక్సెస్‌ను చాలాకాలంగా కోల్పోయిన ఈ ప్రాంతంలోని ఇబ్బందుల్లో ఉన్న నివాసితులకు చాలా అవసరమైన ఉపశమనం కలిగించింది. రిచర్డ్‌సన్ రోడ్, ప్రోత్నీ రోడ్, బయామ్ రోడ్, అల్బైన్ రోడ్, అమ్ముగూడ రోడ్‌లను తిరిగి తెరవాలని ఏప్రిల్ 20న రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి లక్డావాలా జంక్షన్, అమ్ముగూడ రోడ్‌ల గోడలు కూల్చివేయబడ్డాయి.

2014లో రోడ్లు అకస్మాత్తుగా, చట్టవిరుద్ధంగా మూసివేయబడటంతో.. అప్పటి నుండి స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే అన్ని కంటోన్మెంట్లలోని అన్ని మూసివేసిన రోడ్లను తిరిగి తెరవాలని రక్షణ మంత్రిత్వ శాఖ 2018లో నిర్ణయం తీసుకుంది. కంటోన్మెంట్ పరిధిలోని 21 పబ్లిక్ రోడ్లలో ఈ ఐదు రోడ్లు కూడా ఉన్నాయి. కంటోన్మెంట్‌ పరిధిలో రోడ్లు మూసివేయడం వల్ల లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లను తిరిగి తెరవడం ఈ స్ట్రెచ్‌ల ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు ఒక చిన్న విజయం లభించినట్లైంది.

సికింద్రాబాద్‌లోని నార్తర్న్-ఈస్ట్రన్ కాలనీల సమాఖ్య కార్యదర్శి సిఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ''గత వారం జారీ చేసిన ఈ రోడ్లను పునఃప్రారంభించే ఉత్తర్వులకు అనుగుణంగా, రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా లోకల్‌ మిలిటరీ అథారిటీ సికింద్రాబాద్‌లోని గోల్ఫ్ కోర్స్ ప్రాంతంలోని ఐదు రోడ్లపై దిగ్బంధనాన్ని తొలగించడం మాకు సంతోషంగా ఉంది.'' అని అన్నారు. ఈ దిగ్బంధనాలను తొలగించడం వల్ల బాలాజీనగర్, యాప్రాల్, రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవే, సైనిక్‌పురి, ఏఎస్ రావు, బోలారం, శామీర్‌పేట తదితర ప్రాంతాల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. దీని వల్ల కళాశాలలు, పాఠశాలలు, అయ్యప్ప స్వామి దేవాలయం, హోలీ ట్రినిటీ చర్చి భక్తులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది.

దీంతో నిత్యం రద్దీగా ఉండే లోతుకుంట సర్కిల్‌లో రద్దీ తగ్గుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్స్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (SCCiWA) కార్యదర్శి జీతేంద్ర సురానా మాట్లాడుతూ.. ''ఈ ఐదు రోడ్లను తెరవడంతో, ఇది పాక్షికంగా విజయవంతమైంది. ఈ రోడ్లన్నింటినీ తిరిగి తెరవడానికి మా నిరంతర పోరాటంతో మేము తార్కిక ముగింపును చూశాము. చివరకు ఈ రోడ్లు తెరవబడతాయి. మిగిలిన రోడ్లు తెరిచే వరకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పౌరులు మా పోరాటం కొనసాగిస్తారు'' అని తెలిఆపరు. ఎస్‌సీబీ సీఈవో మధుకర్ నాయక్ మాట్లాడుతూ.. ''ఈ రోడ్లను తెరవడం వల్ల రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఉపశమనం లభించింది. కంటోన్మెంట్ బోర్డు వైపు నుండి, మేము ఎటువంటి అడ్డంకులు లేకుండా రహదారిని తెరవాలని లోకల్‌ మిలిటరీ అథారిటీని అభ్యర్థించాము. ఈ మార్గాల్లో కఠినమైన ఆంక్షలు ఉండవని నేను భావిస్తున్నాను'' అని పేర్కొన్నారు.

Next Story