చంద్ర‌బాబుతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ భేటీ

Rajinikanth calls on Chandrababu Naidu in Hyderabad.చంద్రబాబు నాయుడుతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స‌మావేశం అయ్యారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2023 9:47 AM IST
చంద్ర‌బాబుతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ భేటీ

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స‌మావేశం అయ్యారు. హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసంలో సోమ‌వారం ఈ స‌మావేశం జ‌రిగింది. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్ద‌రి మ‌ధ్య భేటి కొన‌సాగింది. ఇది మ‌ర్యాద‌పూర్వ‌క‌మైన భేటి అని టీడీపీ తెలిపింది.

"ఈరోజు నా ప్రియ మిత్రుడు 'తలైవర్' రజనీకాంత్‌ని కలవడం, ఆయనతో సంభాషించడం చాలా ఆనందంగా ఉంది" అని నాయుడు ట్వీట్ చేశాడు. వారి సమావేశానికి సంబంధించిన ఫోటోను ఆయన పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కొంద‌రు వారిద్ద‌రు మంచి స్నేహితులు అని అందుకే క‌లిసారు అని కామెంట్లు పెడుతుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం రాజ‌కీయ కోణంలో చూస్తున్నారు. ఆదివారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో భేటి అయిన ఒక రోజులోనే ర‌జ‌నీకాంత్‌తో చంద్ర‌బాబు స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

చంద్రబాబు-రజనీకాంత్ భేటీలో.. కుశల ప్రశ్నలతో పాటు, ప్రస్తుతం సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌స్తున్న మార్పులు, అలాగే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

Next Story