మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది. రామంతాపూర్ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివసించే పూర్ణచందర్ రావు (34), మాదాపూర్ 'రేస్ పబ్'లో పర్చేసింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఒక వ్యక్తి బైక్‌పై వచ్చి మాట్లాడాలని పిలవడంతో పూర్ణచందర్ రావు బయటకు వెళ్లారు.
అపార్ట్‌మెంట్ బయట వేచి ఉన్న మరికొందరు వ్యక్తులు ఆయనను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. అక్కడ ఇద్దరు మహిళలతో పాటు మరికొందరు ఉన్నట్లు గుర్తించారు. భర్త ఆచూకీ తెలియకపోవడంతో భార్య లక్ష్మీ దుర్గ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కిడ్నాపా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.