ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలు నిషేధం

విద్యా, పరిపాలనా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుందని పేర్కొంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలను నిషేధిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.

By అంజి  Published on  16 March 2025 11:26 AM IST
Protests, sit-ins banned, Osmania University campus, Hyderabad

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలు నిషేధం

హైదరాబాద్‌: విద్యా, పరిపాలనా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుందని పేర్కొంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలను నిషేధిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొత్త ఆదేశం ప్రకారం, విద్యార్థులు, బయటి వ్యక్తులు సరైన అనుమతి లేకుండా విశ్వవిద్యాలయ భవనాల్లోకి ప్రవేశించడం నిషేధించారు.

అదనంగా, వారు నిరసనలు లేదా ప్రదర్శనలు నిర్వహించడం, అంతరాయం కలిగించే నినాదాలు చేయడం, అధికారులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం లేదా అధికారులు లేదా సిబ్బందిపై దుర్భాషను వాడడం వంటివి చేయకూడదు. విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ ఫిర్యాదులను పరిష్కరించడానికి అధికారిక మార్గాలను ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ అధికారులు కోరారు. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత సంస్థాగత అధికారులను సంప్రదించాలని లేదా రిజిస్ట్రార్‌తో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో పదేపదే నిరసనలు జరిగిన తర్వాత విశ్వవిద్యాలయం ఈ చర్య తీసుకుంది.

Next Story