అశోక్ నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన

హిమాయత్ నగర్ అశోక్ నగర్ వద్ద గ్రూప్ వన్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

By Medi Samrat  Published on  18 Oct 2024 4:15 PM IST
అశోక్ నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన

హిమాయత్ నగర్ అశోక్ నగర్ వద్ద గ్రూప్ వన్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గతంలో జరిగిన పిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఫేస్ మాస్కులు ధరించి పెద్ద ఎత్తున అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. పోలీసులు అభ్యర్థులను అడ్డుకునే ప్ర‌యత్నం చేశారు. దీంతో వారంతా అశోక్ నగర్ చౌరస్తాపై బైఠాయించి ఆందోళన చేప‌ట్టారు. పోలీసులు వారిని చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఇరువ‌ర్గాల‌కు మధ్య వాగ్వాదం చెల‌రేగింది. దీంతో పోలీసులు వెంటనే గ్రూప్-1 విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త‌ పరిస్థితి నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేయ‌డంతో అభ్యర్థులు చుట్టుపక్కల ఉన్న షాపుల్లోకి వెళ్లి దాచుకున్నారు.. అయినా పోలీసులు వారిని బయటికి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇదిలాఉండగా మరోవైపు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నది.


Next Story