HYD: జుట్టు ఎక్కువ ఉందని విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్, పేరెంట్స్ ఆందోళన

హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో గల ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ తీరు ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది.

By -  Knakam Karthik
Published on : 9 March 2026 3:06 PM IST

Hyderabad News, Miyapur, School Controversy, Student Rights, Religious Sentiments, Private School

HYD: జుట్టు ఎక్కువ ఉందని విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్, పేరెంట్స్ ఆందోళన

హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో గల ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ తీరు ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది. విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉందన్న సాకుతో, అతనికి బలవంతంగా గుండు చేయించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మియాపూర్ ప్రేమ్ నగర్ బీ-బ్లాక్‌లోని 'బ్లాక్ బోర్డు ది స్కూల్'లో ఈశ్వర్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. జుట్టు ఎక్కువగా పెరిగిందని భావించిన ప్రిన్సిపాల్, దానిని కత్తిరించుకోవాలని విద్యార్థికి సూచించారు.

అయితే, తమ కుటుంబ ఆచారం ప్రకారం లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కు ఉందని, అందుకే జుట్టు కత్తిరించుకోలేనని ఆ విద్యార్థి ప్రిన్సిపాల్‌కు వివరించాడు. అయినప్పటికీ ప్రిన్సిపాల్ వినకుండా, విద్యార్థి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా గుండు చేయించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. భక్తిపూర్వకమైన మొక్కు ఉందని చెప్పినా వినకుండా ఇలా చేయడంపై వారు మండిపడుతున్నారు.

Next Story