రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి కోవింద్‌తో పాటు ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రాష్ట్రపతి దంపతులు హెలికాఫ్టర్‌లో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి బయలుదేరారు.
అక్కడ రాష్ట్రపతి దంపతులు శ్రీరామానుజాచార్యుల స్వర్ణవిగ్రహ ఆవిష్కరణ, సమతామూర్తి భారీవిగ్రహాన్ని సందర్శిస్తారు. సహస్రాబ్ది సమారోహంలో భాగంగా శ్రీరామనగరంలో రాష్ట్రపతి ప్రత్యేకపూజలతోపాటు 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు చినజీయర్ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి బస చేసిన తర్వాత రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.