హైదరాబాద్‌లో దారుణం.. పోర్న్ వీడియో చేయాలని మహిళను పిలిచి..
పోర్న్ వీడియోలో నటిస్తే భారీగా డబ్బులు వస్తాయని నమ్మించాడు. ఆ తర్వాత హోటల్‌కు రమ్మని పిలిచి..
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 5:44 AM GMTహైదరాబాద్‌లో దారుణం.. పోర్న్ వీడియో చేయాలని మహిళను పిలిచి..
రోజురోజుకు ఆడవాళ్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఓ వ్యక్తి మహిళ ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని మోసం చేశాడు. పోర్న్ వీడియోలో నటిస్తే భారీగా డబ్బులు వస్తాయని నమ్మించాడు. ఆ తర్వాత హోటల్‌కు రమ్మని పిలిచి మోసం చేశాడు. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు బోనాల చెన్నకేశవ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈవెంట్ నిర్వహణలో భాగంగా చెన్నకేశవతో పరిచయం ఏర్పడింది. పరిచయంలో భాగంగా సదురు మహళ తనకున్న సమస్యలను అతనితో చెప్పుకుంది. దాంతో.. అదే ఆసరాగా చేసుకున్న చెన్నకేశవ ఆమెను వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ వేశాడు. డబ్బులు పెద్ద మొత్తంలో వస్తాయని.. తాను చెప్పింది చేయాలని ఆశ చూపాడు. తనకు తెలిసిన వెబ్ పోర్న్ వెబ్‌సైట్ ఉందని.. పోర్న్ వీడియోలో నటిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పాడు. రూ.10 లక్షల వరకు వస్తాయని ఆశ చూపించాడు. అప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళ దానికి ఒప్పుకుంది.
అయితే.. వీడియోలో ఆమె ముఖం కూడా కనిపించకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో సదురు మహిళ పోర్న్ వీడియోలో చేసేందుకు ఒప్పుకుంది. దాంతో.. చెన్నకేశవ సదురు మహిళను పంజాగుట్టలోని ఓ హోటల్‌కు రావాలని చెప్పాడు. మహిళ కూడా అక్కడికి చేరుకుంది. హోటల్‌కు మద్యం సేవించాలని అడిగాడు చెన్నకేశవ. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. బ్రీజర్‌ను మాత్రమే తాగింది. అయితే.. చెన్నకేశవ మాత్రం ఆమెకు విస్కీ తాగేలా చేశాడు. అందులో మత్తు మందు ఇచ్చాడు.
కాసేపటికే సదురు బాధితురాలు మత్తులోకి వెళ్లింది. సృహలో లేకపోవడంతో.. నిందితుడు చెన్నకేశవ మహిళపై అత్యాచారం చేశాడు. అంతేకాక ఆమె నగ్న వీడియోలను చిత్రీకించాడు. అవే వీడియోలను చూపించి మహిళను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వాలని.. లేదంటే ముఖం కనిపిస్తున్న నగ్న వీడియోను నెట్టింట పెడతానని బెదిరించాడు. పలుమార్లు డబ్బులు వసూలు కూడా చేశాడు. రోజురోజుకు చెన్నకేశవ వేధింపులు మితిమీరడంతో అవి భరించలేకపోయింది. మరో యువతిని శ్రీశైలంలో జరిగే షూటింగ్‌కు తీసుకురావాలని బెదిరంచాడు. దాంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.