మన దగ్గర సంఖ్యను పెంచుకుంటున్న అరుదైన ప్రాణి
Population of highly endangered Indian mouse deer reached 350 in Hyderabad Zoo.నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో అత్యంత అరుదైన
By న్యూస్‌మీటర్ తెలుగు
నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో అత్యంత అరుదైన జాతికి చెందిన 'ఇండియన్ మౌస్ డీర్' జనాభా 350కి చేరుకుంది. 2010లో నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో కేవలం ఆరు మౌస్ డీర్లు మాత్రమే ఉండేవి. వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతో సంఖ్య బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ జంతుప్రదర్శనశాలలో 350 కంటే ఎక్కువ మౌస్ డీర్ లను విజయవంతంగా పెంచింది.
మౌస్ డీర్-ఇండియన్ స్పాటెడ్ చెవ్రోటైన్ అని కూడా పిలువబడే ట్రాగులిడే కుటుంబానికి చెందినది. "ఇది చాలా పిరికి, రాత్రిపూట తిరిగే జంతువు, చిన్న శబ్దం కూడా చేయకుండా అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఇది శాఖాహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతుంది" అని డిప్యూటీ జూ క్యూరేటర్ ఎ రాజలక్ష్మి చెప్పారు. ఇవి భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లో షెడ్యూల్-Iగా జాబితా చేయబడ్డాయి. అవి నివసించే ప్రాంతాలను విధ్వంసం చేయడం, వేట కారణంగా ఈ జాతి అంతరించే స్థితికి చేరుకుందని, అడవుల్లో కూడా వాటి జనాభా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని రాజలక్ష్మి వివరించారు.
కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ కోసం సెంట్రల్ జూ అథారిటీ, న్యూఢిల్లీ గుర్తించిన 73 అంతరించిపోతున్న జాతులలో మౌస్ డీర్ ఒకటి. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు మౌస్ డీర్ ల సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. "హైదరాబాద్ జంతుప్రదర్శనశాలలో తొలిసారిగా జంతువులను విజయవంతంగా పెంచామని, 2017లో సంతానోత్పత్తి కోసం చెన్నై జూకు పంపామని" ఆమె వివరించారు.
2017లో వాటి సంఖ్యా 6 నుండి 231కి పెరగడంతో బ్రీడింగ్ ప్రోగ్రామ్ విజయవంతమైంది. సాఫ్ట్ రిలీజ్ ప్రోగ్రామ్ ను ఉపయోగించారు. "సాఫ్ట్ రిలీజ్ ప్రోగ్రామ్‌లో, జంతువులు అడవిలో చిన్న చిన్న భాగాలుగా విడుదల చేయబడతాయి. జంతువు ప్రవర్తన ప్రకారం స్థలం మార్చబడుతుంది. మౌస్ డీర్ అడవిలోని ఇతర జంతువులతో కలిసి జీవించగలదని జీవశాస్త్రవేత్తలు, నిపుణులు విశ్వసించే వరకు ఇది కొనసాగుతుంది, "ఆమె చెప్పారు. ఈ జంతువులు వన్యప్రాణుల వాతావరణానికి సరిపోతాయని నిర్ధారించడానికి మూడు కంపార్ట్‌మెంట్‌లు/దశల్లో వివిధ కొలతలతో విడుదల చేయబడుతుంది. మొదటి రెండు దశల్లో జంతువులకు దాణా శాతం ఇస్తారు. చివరి దశలో, ఫీడ్-ఇన్ అందుబాటులో ఉంచరట.
"నిపుణులు అన్ని దశలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. మేము కృత్రిమ దాణాను క్రమంగా తగ్గిస్తాము. జంతువులు దాని సహజ ప్రవర్తనను ప్రదర్శించడానికి ఎక్కువ ప్రాంతాన్ని ఉపయోగించుకునేలా ప్రాంతాన్ని పెంచుతాము" అని జూ జీవశాస్త్రవేత్త సందీప్ చెప్పారు.
తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం, మృగవాణి జాతీయ ఉద్యానవనం వంటి మూడు ప్రదేశాలలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత అనువైన అడవి ఆవాసాలలో వీటిని వదలనున్నారు.
మౌస్ డీర్‌ల ప్రతి బ్యాచ్ ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో కనీసం 15 రోజులు గడుపుతుంది. హైదరాబాద్ జూ ఇప్పటి వరకు 250 మౌస్ డీర్‌లను వివిధ ప్రదేశాలలో విజయవంతంగా విడుదల చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ జూలో మొత్తం 17 ఎన్ క్లోజర్లలో 150 మౌస్ డీర్లు ఉన్నాయి. "ఈ ఎన్‌క్లోజర్‌లలో వెదురు, అకాలిఫా, తాటి చెట్లు ఉన్నాయి, వాటికి సహజమైన వాతావరణాన్ని అందిస్తుంది" అని సందీప్ వివరించారు. మౌస్ డీర్‌లను సాఫ్ట్‌గా విడుదల చేయడానికి ముందు చెవికి ట్యాగ్ చేసిన మైక్రో చిప్‌లు వేస్తారని, తద్వారా వాటిని ట్రాక్ చేయవచ్చని చెప్పారు.