హైదరాబాదీల హృదయాల్లో హలీమ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.అంతేకాదు హలీమ్ ను తినడానికి పలు నగరాల వాసులు హైదరాబాద్ కు చేరుకుంటూ ఉంటారు. హలీమ్ దోస, హలీమ్ బన్ లాంటివి కూడా హైదరాబాద్ లో రంజాన్ నెలలో లభిస్తూ ఉంటాయి. ఈ రంజాన్‌లో హైదరాబాద్ నగరంలో మరో క్రేజీ హలీమ్ అందుబాటులోకి వచ్చింది. అదేమిటంటే వెజ్ హలీమ్. నీలోఫర్ కేఫ్ వెజిటేరియన్ హలీమ్‌ను పరిచయం చేసింది.
ఇరానీ చాయ్ కు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ నీలోఫర్ కేఫ్. వెజ్ హలీమ్ ను తీసుకుని వచ్చి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఆహార సంస్కృతిలో ఆవిష్కరణకు అవధులు లేవని తేల్చి చెప్పడమే కాకుండా.. వెజ్ హలీమ్.. అదెలా ఉంటుంది అనే క్యూరియాసిటీని ప్రజల్లోకి తీసుకొచ్చింది.
వెజిటేరియన్ హలీమ్ ను పరిచయం చేసి అందరికీ ఆరోగ్యకరమైన హలీమ్ వెర్షన్ ను సృష్టించడమే లక్ష్యమని నీలోఫర్ కేఫ్ యజమాని బాబు రావు తెలిపారు. ఈ హలీమ్‌ను ప్రయత్నించాలనుకునే వారికి, మీరు నీలోఫర్ కేఫ్ బంజారా హిల్స్, హిమాయత్ నగర్ బ్రాంచ్ కు వెళ్లాల్సి ఉంటుంది. త్వరలో గచ్చిబౌలి బ్రాంచ్‌లో కూడా అందించాలని యోచిస్తున్నారు.