Hyderabad: పలు పబ్‌లలో ఆకస్మిక సోదాలు

నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని పబ్బుల్లో పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది.

By అంజి  Published on  18 Dec 2023 1:45 AM GMT
Police raids, pubs, Hyderabad

Hyderabad: పలు పబ్‌లలో ఆకస్మిక సోదాలు

నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని పబ్బుల్లో పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లో ఉన్న పలు పబ్‌లలో సోదాలు నిర్వహించారు. అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పోలీసులు స్నిపర్ డాగ్‌లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహించారు. నిన్న సిటీ పోలీసులతో సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి కీలక భేటీ అయిన విషయం తెలిసిందే. రెండు నెలల్లో హైదరాబాదులో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మించాలపి, డ్రగ్స్‌ని పూర్తిగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు.

సిటీలో డ్రగ్స్ , గంజాయి మాట వినొద్దని, నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా సరే విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అంతే కాకుండా పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ సీపీ హెచ్చరించారు. పబ్‌లలో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై తక్షణమే దృష్టి సారించాలని సీపీ ఆదేశించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై పబ్ లపై దాడులు నిర్వహించారు. పలు పబ్ లలో డ్రగ్స్ ,గంజాయి తీసుకుంటున్నట్లు గా సమాచారం రావడంతో పోలీసులు సోదాలు కొనసాగించారు.

Next Story