టాలీవుడ్‌ పబ్‌లో వికృత చేష్టలు.. పోలీసుల ఆకస్మిక దాడి.. 9 మంది యువ‌తుల అరెస్ట్

Police raid on Tollywood pub in Hyderabad.హైదరాబాద్‌లోని పబ్‌ల్లో వింత పోకడలు, వికృత చేష్టలు ఇంకా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2021 9:56 AM GMT
టాలీవుడ్‌ పబ్‌లో వికృత చేష్టలు.. పోలీసుల ఆకస్మిక దాడి.. 9 మంది యువ‌తుల అరెస్ట్

హైదరాబాద్‌లోని పబ్‌ల్లో వింత పోకడలు, వికృత చేష్టలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సీజ్ నోటీసులు అందుకున్నప్పటికీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని టాలీవుడ్ పబ్ తీరు మారడం లేదు. ఆ ప‌బ్‌లో అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో టాలీవుడ్ ప‌బ్ పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ప‌బ్‌లో వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్న 9 మంది యువ‌తులు, 34 మంది యువ‌కులను అదుపులోకి తీసుకున్నారు.

ప‌బ్‌పై దాడి అనంతరం పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా టాలీవుడ్ ప‌బ్‌ను నిర్వ‌హిస్తున్నార‌న్నారు. అలాగే ప‌బ్‌లో స‌మ‌యం దాటిన త‌రువాత కూడా యువ‌తి యువ‌కులు అర్థ‌న‌గ్న డ్యాన్స్‌లు చేస్తున్నట్లు తెలిసింద‌న్నారు. ఇటీవల కాలంలో ఈ పబ్‌పై ఎక్సైజ్‌ మరియు పంజాగుట్ట పోలీసులు కలిసి దాడులు నిర్వహించి.. నోటీసులు అందజేసిన‌ప్ప‌టికీ కూడా ప‌బ్ తీరు మారలేద‌న్నారు. యువ‌తుల‌తో అస‌భ్య‌క‌రంగా నృత్యాలు చేయిస్తున్న క్ల‌బ్ య‌జ‌మాని, మేనేజ‌ర్ స‌హా ముగ్గురిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా.. గ‌తంలోనూ ప‌లుమార్లు వివాదాల‌కు టాలీవుడ్ ప‌బ్ కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Next Story