వ్య‌భిచార గృహంపై దాడి.. న‌లుగురు అరెస్ట్‌

Police raid brothel in Kukatpally.గుట్టుచ‌ప్పుడు కాకుండా వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న ఓ ఇంటిపై పోలీసులు దాడులు చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Oct 2021 11:46 AM IST
వ్య‌భిచార గృహంపై దాడి.. న‌లుగురు అరెస్ట్‌

గుట్టుచ‌ప్పుడు కాకుండా వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న ఓ ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో న‌లుగురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు కేబీహెచ్‌బీకాల‌నీలోని రోడ్డు నెంబ‌ర్‌4లో గ‌ల ఎంఐజీ ఇంటిని రాజు, నూర్ పాషా కాసింబీలు అద్దెకు తీసుకున్నారు. అనంత‌రం ఓ మ‌హిళను తీసుకువ‌చ్చి.. విటుల‌ను ఆక‌ర్షిస్తూ గుట్టుచ‌ప్పుడు కాకుండా వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. స‌మాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఆక‌స్మికంగా దాడి చేసి నిర్వ‌హాకులిద్ద‌రితో పాటు మ‌హిళ‌ను, శేరిలింగంప‌ల్లికి చెందిన ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

మానవ అక్రమ రవాణా చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్ప‌టికే రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. మహిళలకు ఉపాధి కల్పిస్తామంటూ ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వ్యభిచారకూపంలోకి దింపే వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తున్నామన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధించేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఇన్​స్పెక్టర్​కు బాధ్యతలు అప్పజెప్పారు.

Next Story