హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని మోదీ

PM Modi visit Bharat Biotech in Hyderabad .. ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు

By సుభాష్  Published on  28 Nov 2020 8:28 AM GMT
హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడ జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ను సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌ హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే భారత్‌ బయోటెక్‌కు చేరుకున్నారు. భారత్‌ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ, పురోగతిపై సందర్శిస్తున్నారు. మోదీ రాక సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడి జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ సందర్శించారు. బయోటెక్‌లోని శాస్త్రవేత్తలో మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ పర్యటన అనంతరం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు చేరుకుంటారు.

పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని సందర్శిస్తారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అనుమతి ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌కు వస్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Next Story