సంక్రాంతి కానుకగా నేటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు పరుగులు
PM Modi to virtually flag off Vande Bharat Express between Secunderabad-Vizag today.తెలుగు రాష్ట్రాల ప్రజలుఎన్పో రోజుల
By తోట వంశీ కుమార్ Published on 15 Jan 2023 8:54 AM ISTతెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్పో రోజుల నుంచి ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నేడు ఇరు రాష్ట్రాల మధ్య ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 10.30 ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లో జరిగే ప్రారంభోత్స కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జి.కిషన్ రెడ్డిలు పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆదివారం మినహా ఈ రైలు ఆరు రోజులు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీయనుంది. కాగా.. ఈ నెల 16(సోమవారం) నుంచి రైలు ప్రయాణీకులకు అందుబాటులో రానుంది.
సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే ఈ రైలులో మొత్తం16 భోగీలు ఉంటాయి. ఇందులో రెండు భోగీలు ఎగ్జిక్యూటివ్ కేటగిరీవి. మిగలినవి ఎకానమీ కోచ్‌లు. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో 104 సీట్లు ఉండగా.. ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. ఈ రైలులో మొత్తం 1,128 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు.
ఏసీ చైర్ కార్‌లో ఛార్జీలు ఇలా..
విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు రూ.1,720, విశాఖ నుంచి రాజమండ్రికి రూ.625, విశాఖ నుంచి విజయవాడ జంక్షన్ రూ.960, విశాఖ నుంచి ఖమ్మం రూ.1,115, విశాఖ నుంచి వరంగల్ రూ.1,310. సికింద్రాబాద్ నుంచి విశాఖ రూ.1,665, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి రూ.1,365, సికింద్రాబాద్ నుంచి విజయవాడ జంక్షన్ రూ.905, సికింద్రాబాద్ నుంచి ఖమ్మ రూ.750, సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ.520గా ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ
విశాఖ నుంచి సికింద్రాబాద్ రూ.3,170, విశాఖ నుంచి రాజమండ్రి రూ.1,215, విశాఖ నుంచి విజయవాడ జంక్షన్ రూ.1,825, విశాఖ నుంచి ఖమ్మం రూ.2,130. విశాఖ నుంచి వరంగల్ రూ.2,540. సికింద్రాబాద్ నుంచి విశాఖ రూ.3,120, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి రూ.2,485. సికింద్రాబాద్ నుంచివిజయవాడ జంక్షన్ రూ.1,775. సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ.1,460. సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ.1,005గా టికెట్ ధరలను రైల్వే శాఖ నిర్ణయించింది.
ఈ రైలు 5 స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ విశాఖ చేరుకుంటుంది.
అయితే.. నేడు ప్రారంభం సందర్భంగా మాత్రం 21 స్టేషన్లలో ఆగనుంది.చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.