ఆంజనేయులు ఎక్కడ? కాలేజీ యాజమాన్యం పట్టించుకోదా!

హైదరాబాద్ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  26 Aug 2023 5:56 PM IST
ఆంజనేయులు ఎక్కడ? కాలేజీ యాజమాన్యం పట్టించుకోదా!

హైదరాబాద్ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌పై విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల నేతలు దాడికి దిగారు. ఆ కాలేజీలో ఆంజనేయులు అనే విద్యార్ధి అదృశ్యానికి కాలేజ్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విద్యార్ధులు మధ్యాహ్నం విద్యార్ధులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. కాలేజ్‌లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజ్ వద్దకు చేరుకుని విద్యార్ధులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు అందరూ ఒక్కసారిగా గొడవకు దిగడంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. ఆంజనేయులు ఎక్కడ? కాలేజీ హాస్టల్ నుండి ఎలా అదృశ్యమయ్యాడంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థి అదృశ్యం కావడానికి కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు అక్కడకు భారీగా చేరుకొని కాలేజీ అద్దాలను ధ్వంసం చేశారు. కాలేజీ నుండి ఒక విద్యార్థి అదృశ్యమైనా కూడా కాలేజీ యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాలేజీ యజమాన్యం కారణంగానే ఆ విద్యార్థి మిస్సింగ్ అయ్యాడని వెంటనే విద్యార్థి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా కాలేజీలో ఉద్రిక్తత నెలకొనడంతో కాలేజీ యజమాన్యం భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించింది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు.

Next Story