ఖైరతాబాద్ మట్టి గణేష్ కోసం.. రూ.కోటికిపైగా ఖర్చు.!
Organizers are spending more than one crore rupees for Khairtabad Matti Ganesh. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి దేశ వ్యాప్తంగా పేరుంది. ఎందుకంటే.. ఇక్కడ ప్రతిష్ఠించే విగ్రహం చాలా ఎత్తు
By అంజి Published on 21 Aug 2022 6:15 AM GMTహైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి దేశ వ్యాప్తంగా పేరుంది. ఎందుకంటే.. ఇక్కడ ప్రతిష్ఠించే విగ్రహం చాలా ఎత్తు ఉంటుంది. ఖైరాతాబాద్ వినాయకుడిని దగ్గరికి వెళ్లి చూస్తే రెండు కళ్లు చాలవు. అయితే ఈ సారి గణేష్ ఉత్సవాల కోసం.. ఖైరతాబాద్ గణేష్ తయారీకి నిర్వాహకులు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఆసక్తికరంగా.. ఈ సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు బదులుగా మట్టి గణేష్ (పర్యావరణ అనుకూలమైన) విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్ణయించింది.
నరేష్ అనే భక్తుడు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పీఓపీ గణేష్ విగ్రహాలను తయారు చేసేవాళ్లమని, ఈ ఏడాది మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నామని, పర్యావరణహిత గణేష్ విగ్రహాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఖైరతాబాద్‌లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దశాబ్దాలు గడిచాయి. మట్టి పనులు చేసేందుకు చెన్నై నుంచి కళాకారులు వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 100 మంది కళాకారులు.. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారు చేస్తున్నారని తెలిపారు. మరో భక్తుడు మాట్లాడుతూ.. ''ప్రతి సంవత్సరం ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీని చూసేందుకు వస్తాం. హైదరాబాద్‌లోని అతిపెద్ద గణేష్ విగ్రహాన్ని చూడటానికి చాలా మంది ఇక్కడకు వస్తారు.'' అని చెప్పారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ''1954లో ఇక్కడ గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనను శకేరియా జీ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం.. మేము 1 అడుగు ఎత్తు పెంచుతూ వచ్చాం. 2015లో 60 ఏళ్లు పూర్తయ్యాయి.. అప్పటి నుంచి ఏటా సైజు తగ్గించాలని నిర్వాహకులు భావించారు కానీ భక్తులు మాత్రం ఈ ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత ఎత్తు అని, సైజు తగ్గించవద్దని కోరారు. ఈ 68 ఏళ్లలో తొలిసారిగా మట్టి గణేష్‌ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నాం. ఈ ఏడాది దాదాపు 150 మంది కళాకారులు ఈ విగ్రహం కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే ఒరిస్సా, తమిళనాడు, కోల్‌కతా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి ఐదు వివిధ రాష్ట్రాల నుండి పెయింట్స్ రావడం ప్రారంభించాయి. విగ్రహం పూర్తి చేయడానికి 80 రోజులు పడుతుంది. జూన్ 1 నుండి మేము పనిని ప్రారంభించాము. ఆగస్టు 31 నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది.'' అని చెప్పారు.