Hyderabad: డ్యూటీ అవ్వగానే నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డు.. ఇంతలో!!

గోపి అనే సెక్యూరిటీ గార్డు తన షిఫ్ట్ తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2024 7:45 PM IST
Roadaccident, Gajularamaram, Hyderabad

Hyderabad: డ్యూటీ అవ్వగానే నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డు.. ఇంతలో!!

గోపి అనే సెక్యూరిటీ గార్డు తన షిఫ్ట్ తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గోపి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.

అతివేగంగా దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో 40 మీటర్ల దూరం ఎగిరిపడ్డాడు మృతుడు. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు గుద్దడంతో గోపీ కిందపడిపోయాడని, చివరకు ఘటనా స్థలంలోనే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడు మనీష్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రస్తుతం అతడిని జీడిమెట్ల పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదం జరగగానే కారులోని వ్యక్తులు మెల్లగా బయటకు దిగి ఫోన్ మాట్లాడుకుంటూ ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారులో ఉన్న మరో ఐదుగురు ఉన్నారని అంటున్నారు. మృతుడు గోపి తండ్రి ఇటీవల మరణించాడు. గోపి సెక్యూరిటీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Next Story