హైదరాబాద్ న‌గ‌రంలోని పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ కింద మ‌రోసారి మంట‌లు చెల‌రేగాయి. ఫ్లై ఓవ‌ర్ పిల్ల‌ర్‌కు ఏర్పాటు చేసిన ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో వాహ‌న‌దారులు, స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా కొద్దిసేపు అక్క‌డ ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. కాగా.. స‌రిగ్గా మూడు రోజుల క్రితం ఇదే ఫ్లై ఓవ‌ర్ కింద ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌లో మంట‌లు చెల‌రేగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌మాదం షార్ట్ సర్క్యూట్ కార‌ణంగా జ‌రిగిందా? లేక ఎవ‌రైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story