అందం కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్.. భార్యను చూసి భర్త షాక్

ఓ భార్య తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది.

By అంజి  Published on  3 Aug 2023 9:38 AM IST
Old city, woman, beauty fail, Hyderabad

అందం కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్.. భార్యను చూసి భర్త షాక్

అందం కోసం మహిళలు ఎంతదూరమైనా వెళ్తున్నారు. ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అత్యంత అందంగా కనిపించాలని భావిస్తూ బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి ఉన్న అందాన్ని చెడగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ భార్య తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసింది. హెయిర్ ట్రీట్ మెంట్ చికిత్స చేయించుకుంది. అయితే ఆ ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది. బ్యూటీపార్లర్‌ నిర్వాకం మొత్తం బట్టబయలైంది. దీంతో బాగుండాల్సిన జుట్టు మొత్తం ఊడిపోయింది. స్టైల్‌గా ఉండాలని బ్యూటీపార్లర్ వెళ్లిన మహిళకు చివరికి మనోవేదనే మిగిలింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

పాతబస్తీకి చెందిన ఓ మహిళ తన అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు బ్యూటీపార్లర్‌కి వెళ్లింది. పార్లర్‌లో మహిళకు పొడుగ్గా ఉన్న హెయిర్‌ని కట్‌ చేసి హెయిర్‌ ఆయిల్‌ పెట్టింది బ్యూటీషియన్‌. ఆ కాసేపటికే ఆ మహిళ హెయిర్‌ మొత్తం ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా కంగుతున్ని మహిళ ఇంటికి పరుగులు తీసింది. ఇంటికి వచ్చిన భార్యకు హెయిర్ పోవడం చూసి భర్త షాకయ్యాడు. అందగా కనిపించాలనుకున్న భార్యకు ఉన్న వెంట్రుకలు కూడా పోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ బాధిత మహిళ ఊడిపోతున్న వెంట్రుకలని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లింది. అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో బ్యూటీ పార్లర్ పై బాధిత మహిళ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story