హైదరాబాద్ నగరంలోని బంజరాహిల్స్‌లో గల కేబీఆర్క్ వద్ద మొన్న రాత్రి సినీ నటి చౌరాసియాపై ఓ దుండుగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలను బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. నటి చౌరాసియాపై ఎలాంటి అత్యాచారం జరగలేదని.. నటిపై అత్యాచారం జరిగినట్లు వాస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. సెల్‌ఫోన్ దొంగిలించేందుకునే దుండగులు ఆమెపై దాడి చేశాడని అన్నారు. నిందితుడి గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతి త్వరలో నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. నటిపై దాడికి సంబంధించిన కేసు దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు.
నటి చౌరాసియా ఒంటరిగా వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి నటి చౌరాసియాపై దాడి చేశాడు. దుండగుడు ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. దుండగుడిని వదిలించుకునేందుకు చౌరాసియా ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే దుండుగుడు ఆమెను పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆమెకు తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆమె డయల్ 100కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బండరాయితో తనపై దాడి చేసేందుకు యత్నించాడని నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయాలపాలైన నటి చౌరాసియాను దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వరుసగా దారి దోపిడీలు జరుగుతున్నాయి.