సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో.. అప్పుడే పుట్టిన శిశువు లభ్యం

Newborn baby found on platform at Secunderabad railway station. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.2పై సోమవారం

By అంజి  Published on  18 Jan 2022 6:00 AM GMT
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో.. అప్పుడే పుట్టిన శిశువు లభ్యం

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.2పై సోమవారం నవజాత శిశువును తల్లిదండ్రులుల వదిలేశారు. దాదాపు 20 రోజుల వయస్సు గల పసికందును తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రయాణీకులు ఆమె ఏడుపు విన్న తర్వాత చిన్నారి కనిపించిందని వర్గాలు తెలిపాయి. బాలల హక్కుల సంస్థ దివ్య దిశ వాలంటీర్లు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని అమీర్‌పేటలోని శిశు విహార్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా గుర్తుతెలియని దంపతులు చిన్నారిని వదిలివెళ్లినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిని గుర్తించి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆమె తల్లిదండ్రులను గుర్తించడానికి సమీపంలోని ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లలో జనన రికార్డులను కూడా అధికారులు ధృవీకరిస్తున్నారు.

ఇక మరో ఘటనలో వేలూరులోని చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిన కొద్ది రోజులకే ఆడ శిశువు కనిపించింది. పాప ఏడుపు విన్న స్థానికులు చెత్తాచెదారంలో వెతకగా, వదిలేసిన పాపను గుర్తించారు. స్థానికులు వెంటనే వేలూరు నార్త్ పోలీసులకు, ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించారు. పాప కనిపించిన పక్కనే డ్రస్సులతో కూడిన చిన్న బ్యాగును పోలీసులు గుర్తించారు. పసికందును వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ప్రాథమిక విచారణలో చిన్నారి వయసు కేవలం రెండు, మూడు రోజులేనని అనుమానిస్తున్నారు. చిన్నారి కూడా కోలుకుంటున్నట్లు సమాచారం. వేలూరు నార్త్ పోలీసులు ఇప్పుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు.

Next Story