ముకర్రం జా కుమారుడికి నిజాం ట్రస్టు బాధ్యతలు.. త్వరలోనే ప్రకటన!

Mukarram Jah’s son Azmat likely to assume Nizam Trusts’ charge. హైదరాబాద్: నిజాం ట్రస్టు బాధ్యతలను ముఖరం జా, ఎస్రా జా దంపతుల కుమారుడు అజ్మత్ జాహ్

By అంజి  Published on  20 Jan 2023 5:23 AM GMT
ముకర్రం జా కుమారుడికి నిజాం ట్రస్టు బాధ్యతలు.. త్వరలోనే ప్రకటన!

హైదరాబాద్: నిజాం ట్రస్టు బాధ్యతలను ముఖరం జా, ఎస్రా జా దంపతుల కుమారుడు అజ్మత్ జాహ్ స్వీకరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడనుంది. జూలై 23, 1960న లండన్‌లో జన్మించిన అజ్మత్ జా.. ఇంగ్లాండ్‌లో తన ప్రారంభ విద్యను పూర్తి చేసి, సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తదుపరి చదువును కొనసాగించాడు. వృత్తి రీత్యా అజ్మత్ జా ఫిల్మ్ మేకర్, జా తన తండ్రి కోరిక మేరకు నిజాం ట్రస్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

మక్కా మసీదు వద్ద ముకర్రం జా యొక్క జియారత్

కాగా, శుక్రవారం సాయంత్రం మక్కా మసీదులో ముకర్రం జా జియారత్ జరగాల్సి ఉంది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన మృతదేహాన్ని చార్టర్డ్‌ విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో పార్థివదేహాన్ని ఉంచారు, అక్కడ ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం భౌతికకాయాన్ని చారిత్రక మక్కా మసీదుకు తరలించారు. 'నమాజ్-ఎ-జనాజా' తర్వాత, మసీదు ప్రాంగణంలోని అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద ముకర్రం జా బహదూర్ అంత్యక్రియలు జరిగాయి.

హైదరాబాద్ నిజాం వారసత్వం ముగిసింది

మీర్ ముక్కరం జా మరణంతో హైదరాబాద్ నిజాం వారసత్వం అంతరించింది. జూన్ 14, 1954, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతనిని వారసుడిగా ముకర్రం జాని నియమించారు. అతని పట్టాభిషేకం 1967లో చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగింది. అతను అధికారికంగా 1971 వరకు హైదరాబాద్ ప్రిన్స్ అని పిలువబడ్డాడు. 1980 వరకు అతను భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు. ముకర్రం జా తర్వాత తొమ్మిదో నిజాం బిరుదును అజ్మత్ జా పొందాల్సి ఉంది. అయితే 1971లో 26వ సవరణ చట్టం ద్వారా బిరుదలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అజ్మత్‌ జా నిజాం IX బిరుదును పొందలేరు.

Next Story