కదులుతున్న కారులో చెలరేగిన మంటలు.. అసెంబ్లీ సమీపంలో ఘటన

Moving car catches fire near Telangana Assembly. హైదరాబాద్‌ నగరంలో కదులుతున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని తెలంగాణ శాసనసభ వద్ద

By అంజి
Published on : 12 March 2022 3:03 PM IST

కదులుతున్న కారులో చెలరేగిన మంటలు.. అసెంబ్లీ సమీపంలో ఘటన

హైదరాబాద్‌ నగరంలో కదులుతున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని తెలంగాణ శాసనసభ వద్ద శనివారం మధ్యాహ్నం కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి మంటలు రావడంతో డ్రైవర్‌, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. కారు బేగంబజార్ నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ దానిని ఆపేశాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ – టీఎస్ 09 ఈవీ 3423.

Next Story