దారుణం : రెండు రోజుల పసిగుడ్డును ఆటోలో వదిలేసి వెళ్లిన కసాయి తల్లి
mother who left her two days old baby in auto. సికింద్రాబాద్ బస్టాండ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పసిగుడ్డు అయిన రెండు రోజుల పాపాయిని ఆటో డిక్కీలో వదిలేసి వెళ్లింది ఓ కసాయి తల్లి
By Medi Samrat Published on
11 March 2021 5:57 AM GMT

సికింద్రాబాద్ బస్టాండ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పసిగుడ్డు అయిన రెండు రోజుల పాపాయిని ఆటో డిక్కీలో వదిలేసి వెళ్లింది ఓ కసాయి తల్లి. సులబ్ కాంప్లెక్స్ కు వెళ్లి వచ్చిన ఆటో డ్రైవర్.. విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బస్టాండ్‌లోని ఆటో స్టాండ్ వద్ద ఆటోను నిలిపి.. మూత్ర విసర్జనకు వెళ్ళాడు ఆటో డ్రైవర్.. ఆ పసికందు బారం అనుకుందో ఏమో కాని ఆ తల్లి.. ఆటో వెనుక సీటు ప్రక్కన ఉండే ఖాళీ స్థలంలో పాపాయిని పడుకో బెట్టి వెళ్ళిపోయింది. ఆటో డ్రైవర్ వచ్చి చూడగా పాపాయి ఎడుస్తుండడంతో స్థానిక మోండ మార్కెట్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న మోండ మార్కెట్ పోలీసులు.. సీసీ పుటేజీ వీడియోల ఆధారంగా ఎవరు వదిలిపెట్టి వెళ్లారన్నది దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పాపాను ఆసుపత్రికి తరలించి యోగక్షేమలు చూస్తున్నారు.
Next Story