Hyderabad: ఐస్‌క్రీం టేస్టింగ్‌ ఛాలెంజ్‌ పోటీలు.. భారీగా తరలి వచ్చిన జనం

హైదరాబాద్ మైదాన్‌ ఎక్స్‌ఫో సెంటర్‌లో హైబిజ్ టీవీ, తెలంగాణ విజయ డెయిరీ సంయుక్తంగా నిర్వహించిన 'గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్

By అంజి  Published on  20 Jun 2023 8:50 AM IST
Great Indian Ice Cream Tasting Challenge, Hybiz TV, Hyderabad, Vijaya Dairy

Hyderabad: ఐస్‌క్రీం టేస్టింగ్‌ ఛాలెంజ్‌ పోటీలు.. భారీగా తరలి వచ్చిన జనం

హైదరాబాద్ మైదాన్‌ ఎక్స్‌ఫో సెంటర్‌లో హైబిజ్ టీవీ, తెలంగాణ విజయ డెయిరీ సంయుక్తంగా నిర్వహించిన 'గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్' రెండో ఎడిషన్‌లో పాల్గొనేందుకు వివిధ రంగాలకు చెందిన 1,000 మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. టేస్టింగ్ ఛాలెంజ్‌లో భాగమైన వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను రుచిచూస్తూ ఐస్‌క్రీమ్ ప్రేమికులు హైదరాబాద్‌లోని వేసవి వేడి నుండి విరామం తీసుకున్నారు. ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్‌లో మెర్సిలీస్, మిల్కీ మిస్ట్, స్కూప్స్, మెల్ట్ ఎన్ మిలో, స్కిప్పి ఐస్ పాప్స్, బాస్కిన్-రాబిన్స్, కూల్ ఎవరెస్ట్, బోనిటాస్, స్నో డ్రాప్స్, అనేక ఇతర ప్రముఖ ఐస్ క్రీం బ్రాండ్‌లతో సహా 20 కంటే ఎక్కువ ఐస్ క్రీం ఎగ్జిబిటర్లు ఉన్నారు.

ఈ ఈవెంట్‌లో కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీం ఫ్లేవర్ల పేరు తెలపిన ఎల్‌బీ నగర్‌కు చెందిన భవానీ లక్షా 40వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకోగా, రెండో బహుమతిగా రూ. 50,000, రూ. 25,000 విలువ గల దేశీయ వెకేషన్ ప్యాకేజీని కొండాపూర్‌కు చెందిన సల్మా మహ్మద్ గెల్చుకున్నారు. ఉప్పల్‌కు చెందిన దుర్గాప్రసాద్‌రెడ్డి తృతీయ బహుమతిగా రూ. 25,000 విలువైన దేశీయ హాలిడే ట్రావెల్ ప్యాకేజీతో రూ. 20,000 గెల్చుకున్నారు. మొత్తం 10 మంది వ్యక్తులు నాల్గవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఇందులో రూ. 5000 విలువ గల దేశీయ వెకేషన్ ప్యాకేజీ, రూ. 15,000 నగదు బహుమతి లభించింది. విజేతలకు తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ సోమ భరత్ కుమార్ బహుమతులు అందజేశారు.

Next Story