USAID నిధుల స్తంభన.. హైదరాబాద్‌లోని మిత్ర్ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మూసివేత
అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో.. హైదరాబాద్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మూసివేయబడింది.
By అంజి
USAID నిధుల స్తంభన.. హైదరాబాద్‌లోని మిత్ర్ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మూసివేత
అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో.. హైదరాబాద్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మూసివేయబడింది. హైదరాబాద్ నగరంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఆరోగ్య సంరక్షణ అందించే మొట్టమొదటి క్లినిక్‌లలో ఒకటైన మిత్ర్ క్లినిక్.. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) నుండి నిధులు నిలిపివేయబడిన తర్వాత మూసివేయబడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశం మేరకు అన్ని USAID నిధులు 90 రోజుల పాటు స్తంభింపజేయబడ్డాయి.
నిధుల ఆకస్మిక నిలిపివేత అనేక ప్రపంచ కార్యక్రమాలను ప్రభావితం చేసింది. వాటిలో ప్రాజెక్ట్ ACCELERATE కూడా ఉంది. దీని కింద మిత్ర్ క్లినిక్ నిర్వహించబడింది. ACCELERATE HIV కేంద్రం.. నిరంతరాయంగా నివారణ, చికిత్స సేవలను అందిస్తుంది. ట్రాన్స్ కమ్యూనిటీ సభ్యులకు సపోర్ట్‌గా ఉంటోంది.
జనవరి 2021లో స్థాపించబడిన మిత్ర్ క్లినిక్.. సాధారణ ఆరోగ్య సంప్రదింపులు, HIV కౌన్సెలింగ్, స్క్రీనింగ్, HIV/STI చికిత్స, మానసిక ఆరోగ్య మద్దతు, లింగ నిర్ధారణ సేవలు, చట్టపరమైన, సామాజిక పథకాలను పొందడంలో సహాయం వంటి ఉచిత సేవలను అందిస్తూ, వన్-స్టాప్ సెంటర్‌గా పనిచేసింది.
ఈ క్లినిక్‌లో ఏడుగురు ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు ఉన్నారు. ఈ క్లినిక్ 150–200 LGBTQIA+ వ్యక్తులకు సేవలను అందించింది. జూన్ 2024 నాటికి, ఇది 4,900 కంటే ఎక్కువ మంది క్లయింట్‌లను నమోదు చేసుకుంది, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులలో అధిక HIV భారంపై దృష్టి సారించింది. 6% HIV పాజిటివిటీ రేటు, 83% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) పొందుతున్నారని క్లినిక్‌తో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పదవిలోకి వచ్చిన మొదటి రోజే, అమెరికా విదేశీ సహాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.