హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందిరమ్మ క్యాంటీన్ పేరుతో రూ.5లకే బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని మోతీనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ ఇందిరమ్మ క్యాంటీన్‌లలో రూ.5 కే బ్రేక్ ఫాస్ట్, రూ.5కే భోజనం లభించనుంది. కాగా అల్పాహారంపై రూ.14, భోజనంపై రూ.24.83ను జీహెచ్‌ఎంసీ వెచ్చించనుంది.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్ లను ప్రారంభించాం. ఇప్పటికే రూ.5 కే భోజనం అందిస్తున్నాం. ఇక నుంచి రూ.5 కే బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తాం. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్ లలో భోజనంతో పాటు అల్పాహారం ప్రజలకు అందిస్తాం. ప్రభుత్వం పై ఆర్థికంగా భారం పడినప్పటికీ స్వల్ప రేట్లకే పేద వారికీ నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం..అని పొన్నం పేర్కొన్నారు.