కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. ట్రాఫిక్ క‌ష్టాలు ఇక చెల్లు

Minister KTR inaugurates Kaithalapur Flyover.హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. కైతలాపూర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2022 6:27 AM GMT
కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. ట్రాఫిక్ క‌ష్టాలు ఇక చెల్లు

హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభం కావ‌డంతో కూకట్ పల్లి – హైటెక్ సిటీల మధ్య ప్రయాణించే వారికి ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి. వారి ప్ర‌యాణం సాపీగా సాగ‌నుంది.

జేఎన్టీయూ, మ‌లేషియా టౌన్‌షిప్‌, హైటెక్ సిటి ఫ్లై ఓవ‌ర్‌, సైబ‌ర్ ట‌వ‌ర్ కూడ‌లి వ‌ద్ద కూడా ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గ‌నుంది. ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్ర‌యాణ స‌మ‌యం గంట వ‌ర‌కు ఆదా కానుంది

సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం ఫలాలు నగరానికి నలువైపులా అందుతున్నాయి. ఎస్ఆర్ఢీపీ ద్వారా చేపట్టిన 41 పనుల్లో 29 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే కైతలాపూర్ ఆర్వోబీ నిర్మాణం కూడా పూర్తయింది. రూ. 86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని నిర్మించింది.

Next Story