బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR inaugurates Balanagar Flyover.హైద‌రాబాద్ న‌గ‌రవాసులు ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి. న‌గ‌రంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 11:19 AM IST
బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రవాసులు ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి. న‌గ‌రంలో మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. బాలాన‌గ‌ర్ చౌర‌స్తాలో నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధ‌వ‌రం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ న‌వీన్ రావుతో పాటు స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. ఫ్లైఓవర్‌ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కూకట్‌పల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు.

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు జ‌గ్గీవ‌న్‌రామ్ వంతెన‌గా పేరు నిర్ణ‌యించామ‌న్నాం. దుర్భ‌ర‌మైన ట్రాపిక్ క‌ష్టాలు ఉండే ప్రాంతాల్లో బాలాన‌గ‌ర్ ఒక‌టి. ఎస్ఆర్‌డీపీలో భాగంగా ఇప్ప‌టికే వంతెన‌లు, అండ‌ర్‌పాస్ అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. మిగిలిన ఫ్లైఓవ‌ర్లు కూడా త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రి వ‌ల్లే రెండు స్కైవేలు సాధ్యం కావ‌డం లేద‌న్నారు. వంతెన‌ల కోసం అవ‌స‌ర‌మైన భూముల‌ను కేంద్రం ఇవ్వ‌టం లేదని తెలిపారు.

బాలానగర్‌ ఫ్లైఓవర్ ను మూడు సంవ‌త్స‌రాల 11 నెల‌ల స‌మ‌యంలో పూర్తి చేశారు. 1.13 కిలోమీటర్ల దూరం. 24 మీటర్ల వెడల్పుతో.. 26 పిల్ల‌ర్ల‌తో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్‌ సైతం ఏర్పాటు చేశారు. వాటిలో చక్కటి పూల మొక్కలు నాటారు. ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చారు.

Next Story