హైడ్రాకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసనలు మొదలయ్యాయి. సోమవారం బహదూర్‌పురా మండల రెవెన్యూ కార్యాలయం (MRO) వద్ద హైడ్రాకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో నలుగురు AIMIM కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. హైడ్రా కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు ధర్నాలో పాల్గొన్నారు. బహదూర్‌పురా పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. 'హైడ్రా హటావో, ఘర్ బచావో', 'సీఎం డౌన్ డౌన్' అంటూ నాయకులు, ప్రజలు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన కార్పొరేటర్లను ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైడ్రా ఇటీవలి చర్యలు, ముఖ్యంగా మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ చేపడితే వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవుతారనే కారణంగా అందరూ నిరసనలు చేపట్టారు.
తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ ఎవి రంగనాథన్ కు పలు ప్రశ్నలు సంధించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను హైడ్రా చీఫ్, అమీన్‌పూర్ మండల తహశీల్దార్ లెక్కచేయకుండా, ఆదివారం నాడు నిర్మాణాలను కూల్చివేశారని విమర్శించారు. ఎఫ్‌టిఎల్‌లో కూల్చివేతల పరిణామాలపై కూడా హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. హైడ్రా చీఫ్ ఆదేశిస్తే చార్మినార్ లేదా హైకోర్టును కూల్చివేసేందుకు కూడా సిద్ధమవుతారా అని హై కోర్టు ప్రశ్నించింది.