హైదరాబాద్: పేట్ బషీరాబాద్‌లోని గుండ్లపోచంపల్లిలోని వి కన్వెన్షన్ హాల్ వద్ద సోమవారం తెల్లవారుజామున గోడ కూలి ఒక వలస కార్మికుడు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రాత్రిపూట కురిసిన భారీ వర్షాల తర్వాత తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు గగన్ (50) అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని చికిత్స కోసం సీఎంఆర్ ఆసుపత్రికి తరలించారు.
బాధితులు అపర్ణ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంలోని రెడీ-మిక్స్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వలస కార్మికులని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కన్వెన్షన్ హాల్ గోడకు ఆనుకుని నిర్మించిన తాత్కాలిక టిన్ షెడ్లలో వారు నివసిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తడిసిన ఉన్నపలంగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు.