మెట్రో ప్రయాణీకులకు శుభవార్త
Metro Train Timings Extended in Hyderabad.హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారికి నిజంగా ఇది శుభవార్తే.
By తోట వంశీ కుమార్ Published on
5 Sep 2021 6:19 AM GMT

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారికి నిజంగా ఇది శుభవార్తే. రేపటి(సోమవారం) నుంచి మెట్రో సమయాల్లో మార్పులు చేశారు. సెప్టెంబర్ 6 నుంచి మరో అరగంట అదనంగా మెట్రో సేవలను పొడిగించారు. రేపటి నుంచి రాత్రి 10.15 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాత్రి 9.45కే చివరి సర్వీస్ ఉండగా.. ప్రయాణీకుల సౌకర్యార్థం దాని సమయాన్ని మరో అరగంట పొడిగించారు.
కాగా.. ఉదయం 7 గంటల నుంచే మైట్రో సేవలు ప్రారంభం అవుతాయని ఆ సమయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. హైదరబాద్ నగరంలో మూడు మార్గాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. సుమారు రోజుకు వేయి ట్రిప్పులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Next Story