ఆదివారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ క్లబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఇవాళ ఉదయం 3 గంటలకు సంభవించిందని సమాచారం. అగ్నికీలలు భారీగా ఎగిసిపడటంతో.. మంటలు కబ్ల్ అంతటా వ్యాపించాయి. దీంతో సికింద్రాబాద్ క్లబ్ పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి వచ్చారు. సుమారు 10 ఫైరింజన్లతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను ఆర్పేశారు. క్లబ్‌లో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి సుమారు 4 గంటల సమయం పట్టిందని తెలిసింది. అయితే ఈ ఘటనలో క్లబ్ పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ క్లబ్‌ను 1878లో బ్రిటీష్ హయాంలో మిలిరీ అధికారుల కోసం కట్టారు.2017లో సికింద్రాబాద్ క్లబ్‌ను భారీయ వారసత్ సంపదగా గుర్తించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ క్లబ్ పోస్టల్ కవర్ కూడా విడుదల చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్‌లో 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. సికింద్రాబాద్ క్లబ్‌లో 5 వేల మందికి పై సభ్యులు ఉన్నారు.