హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..కెమికల్ గోడౌన్‌లో మంటలు, భయాందోళనలు స్థానికులు (video)

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By -  Knakam Karthik
Published on : 9 April 2026 8:15 AM IST

Hyderabad, Jeedimetla, FireAccident, Scrap Godown, IndustrialArea

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..కెమికల్ గోడౌన్‌లో మంటలు, భయాందోళనలు స్థానికులు (video)

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుభాష్‌నగర్ గంపల బస్తీ పరిధిలోని ఒక స్క్రాప్ మరియు కెమికల్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గోదాంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వ్యర్థాలు, కెమికల్ డ్రమ్‌లకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో గోదాంలోని నిల్వలు పూర్తిగా కాలిపోయి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story