హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..డెకరేషన్ గోదాం దగ్ధం, తప్పిన ప్రాణనష్టం!

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి సర్వారెడ్డి కాలనీలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By -  Knakam Karthik
Published on : 12 April 2026 3:04 PM IST

Hyderabad, Rajendranagar, FireAccident, Shivramapally

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..డెకరేషన్ గోదాం దగ్ధం, తప్పిన ప్రాణనష్టం!

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి సర్వారెడ్డి కాలనీలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక డెకరేషన్ సామగ్రి గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాములో భారీగా ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ వంటి మండే స్వభావం గల వస్తువులు ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి.

ఈ మంటల ధాటికి పక్కనే ఉన్న ఒక నివాస గృహం కూడా ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story