హైదరాబాద్‌లో భారీగా కల్తీ పనీర్ సీజ్..3,000 కిలోల నకిలీ పనీర్ పట్టివేత

హైదరాబాద్‌లో కల్తీ పనీర్ తయారీ మరియు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.

By Knakam Karthik
Published on : 18 March 2026 8:40 PM IST

Hyderabad News, Adulterated Food, Fake Paneer, Task Force Raid, MahankaliPolice

హైదరాబాద్‌లో భారీగా కల్తీ పనీర్ సీజ్..3,000 కిలోల నకిలీ పనీర్ పట్టివేత

హైదరాబాద్‌లో కల్తీ పనీర్ తయారీ మరియు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో దాదాపు 3,000 కిలోల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం ఆరు దుకాణాలపై జరిగిన ఈ దాడుల్లో.. శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్ నుండి 1,600 కిలోలు, విజయ్ మిల్క్ & కర్డ్ షాప్ నుండి 1,000 కిలోల నకిలీ పనీర్‌ను సీజ్ చేశారు. ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలతో పనీర్ తయారు చేసి నగరం అంతటా సరఫరా చేస్తున్న నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story