హైదరాబాద్: ముసుగు ధరించిన దుండగులు హైదరాబాద్‌లోని హెచ్‌డిఎఫ్‌సి ఎటిఎంను లక్ష్యంగా చేసుకుని పెద్ద మొత్తంలో నగదును దోచుకున్నారు. జీడిమెట్లలోని మార్కండేయ నగర్ బ్రాంచ్‌లో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు ముసుగు దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలోని మూడు మిషన్‌లను కట్ చేసి అందులో ఉన్న నగదు తీసుకుని, అలారం మోగడానికి ముందే పారిపోయారు. అధికారులు అప్రమత్తమయ్యే సమయానికి, నిందితులు దొంగిలించబడిన నగదుతో అక్కడి నుండి పారిపోయారు.
దొంగతనం జరిగిన గంట తర్వాత అలారం మోగడంతో వెంటనే జీడిమెట్ల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు, క్లూస్ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నేరస్థులను గుర్తించడానికి అధికారులు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఏటీఎం సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో దుండగుల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.