హైదరాబాదీ బిర్యానీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
Many health benefits with Hyderabadi biryani. హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలోని రుచికరమైన వంటలలో ఒకటి అని అందరికీ తెలుసు, కానీ దానిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు
By అంజి Published on 26 Jan 2023 2:50 PM GMTహైదరాబాదీ బిర్యానీ భారతదేశంలోని రుచికరమైన వంటలలో ఒకటి అని అందరికీ తెలుసు, కానీ దానిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆఫ్రికన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AJFST) ఇటీవల ప్రచురించిన నివేదికలో ఈ వంటకం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను వెల్లడించింది. ఇందులో అన్నం, కూరగాయలు, గుడ్డు, మాంసం మొదలైన అనేక రకాల పదార్థాలు ఉన్నందున, ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పూర్తి భోజనం అని పేర్కొంది.
హైదరాబాదీ బిర్యానీ ఆరోగ్య ప్రయోజనాలు
హైదరాబాదీ బిర్యానీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో మొదటి ఐదు ఇవే.
* అంతర్గత అవయవాలకు ప్రయోజనాలు
* జీర్ణక్రియకు సహాయపడుతుంది
* విటమిన్లు సరఫరా చేస్తుంది
* కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
* శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది
హైదరాబాదీ బిర్యానీలో యాంటీఆక్సిడెంట్లు ఉండే మసాలాల శ్రేణి ఉన్నందున, ఇది అంతర్గత అవయవాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. బిర్యానీ తయారీలో ఉపయోగించే నల్ల మిరియాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. సల్ఫ్యూరిక్ సమ్మేళనాలు, మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి మొదలైనవి పుష్కలంగా ఉండే వంటకం.. ఈ బిర్యానీ. ఇది శరీరానికి తగినంత విటమిన్లను అందిస్తుంది.
మసాలా దినుసులు.. కాలేయ యాంటీఆక్సిడెంట్‌గా పిలువబడే గ్లూటాతియోన్‌ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, హైదరాబాదీ బిర్యానీ మానవ శరీరంలోని అతిపెద్ద అంతర్గత అవయవం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైదరాబాదీ బిర్యానీ తయారీలో ఉపయోగించే కుంకుమపువ్వు కాలేయ ఎంజైమ్‌లను పెంచి శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది.
స్విగ్గీలో ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది
2022లో స్విగ్గీలో ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. అత్యధికంగా ఆర్డర్ చేసిన టాప్ 10 వంటకాల జాబితాలో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ రెండూ ఉన్నాయి. అంతకుముందు ఏడాది కూడా బిర్యానీ వంటకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. స్విగ్గీ నివేదిక ప్రకారం, 2021లో నిమిషానికి 115 ప్లేట్ల బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి.
ఫుడ్ అగ్రిగేటర్ ప్రకటన ప్రకారం.. ''2020లో నిమిషానికి 90 బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి. ఇది 2021లో 115కి పెరిగింది. ఇది సెకనుకు 1.91కి వస్తుంది.'' ప్రతి సంవత్సరం ఈ హైదరాబాదీ డిష్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంది.