హైదరాబాద్‌లో ఓ దుకాణ షాపు యజమాని అమానుషంగా ప్రవర్తించారు. షాపులో కూల్ డ్రింక్ బాటిల్ చోరీకి పాల్పడ్డాడంటూ ఓ షాపు యజమాని తొమ్మిదేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసి అతని ప్రైవేట్ భాగాలపై కారం చల్లి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన నాంపల్లిలో చోటుచేసుకుంది. కృష్ణగా గుర్తించిన దుకాణదారుడు తన దుకాణం నుండి కూల్ డ్రింక్ బాటిల్ దొంగిలించాడని బాలుడిని పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి బట్టలు విప్పి చేతులు, కాళ్లు తాడుతో కట్టేశాడు.
అనంతరం అతడిపై దారుణంగా దాడి చేసి ప్రైవేట్ భాగాలపై కారం చల్లాడు. ఈ ఘటన మొత్తాన్ని రికార్డు చేసి తన స్నేహితులు, బంధువులతో పంచుకున్నాడు. ఏదో ఘన కార్యం చేసినట్లు పైశాచికానందం పొందాడు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని బాలుడిని విడిపించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని దారుణంగా కొట్టిన షాపు యజమాని కృష్ణపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.