మెట్రో స్టేష‌న్‌లోని లిఫ్ట్‌లో యువకుడి వికృత చేష్టలు.. దుస్తులు విప్పి

Man Misbehaves in front of woman in Ameerpet Metro Station Elevator.మహిళలపై అరాచకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2022 7:51 AM GMT
మెట్రో స్టేష‌న్‌లోని లిఫ్ట్‌లో యువకుడి వికృత చేష్టలు.. దుస్తులు విప్పి

మహిళలపై అరాచకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కామాంధుల ఆగడాలకు మహిళలు బలైపోతున్నారు. ఇక ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల రెచ్చిపోతున్నారు. షాపింగ్ పూర్తి చేసుకుని మెట్రో రైలు ఎక్కుదామ‌ని రైల్వే స్టేష‌న్‌లోని లిఫ్ట్ ఎక్కిన ఓ మ‌హిళ ఎదుట వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డిన యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళ(23) మంగళవారం షాపింగ్‌ చేసేందుకు అమీర్‌పేటకు వచ్చింది. షాపింగ్ పూర్తైన అనంత‌రం తిరిగి ఖైర‌తాబాద్‌కు వెళ్లేందుకు అమీర్‌పేట మెట్రో స్టేష‌న్ లిఫ్ట్ ఎక్కింది. ఆమె వెనుకాలే వ‌చ్చిన ఓ యువ‌కుడు లిఫ్ట్‌లోకి ప్ర‌వేశించాడు. అనంత‌రం త‌న దుస్తులు విప్పి.. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌సాగాడు. ఆ మ‌హిళ భ‌యంతో ప‌రుగున బ‌య‌ట‌కు వ‌చ్చి విష‌యాన్ని మెట్రో సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లింది. వెంట‌నే వారు అత‌డిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు.

విచార‌ణ‌లో ఆ యువ‌కుడిని ఒడిషాకు చెందిన రాజు(18)గా గుర్తించారు. అత‌డు రోజు మెట్రోస్టేష‌న్ లిఫ్ట్ వ‌ద్దే ఉంటూ ఒంట‌రిగా వెళ్లే మ‌హిళ‌ల ముందే ఇదే తీరుగా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. పోలీసులు అతనిపై CP చట్టంలోని సెక్షన్ 70C (ఏదైనా బెదిరింపు, అవమానకరమైన లేదా అసభ్యకరమైన పదాలు లేదా సంజ్ఞలను ఉపయోగించడం) కింద కేసు నమోదు చేశారు.

Next Story