ప్రేమ మ‌త్తు.. పెళ్లికి ఒప్పుకోవ‌డం లేద‌ని.. యువ‌తి ఇల్లు త‌గుల‌బెట్టాడు

Man burning girl house in Jawahar Nagar.యువ‌తిని ప్రేమ పేరుతో రెండేళ్లుగా ఓ యువ‌కుడు వేదిస్తున్నాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 9:10 AM IST
ప్రేమ మ‌త్తు.. పెళ్లికి ఒప్పుకోవ‌డం లేద‌ని.. యువ‌తి ఇల్లు త‌గుల‌బెట్టాడు

యువ‌తిని ప్రేమ పేరుతో రెండేళ్లుగా ఓ యువ‌కుడు వేదిస్తున్నాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న బాగాలేక‌పోవ‌డంతో యువ‌తి త‌ల్లిదండ్రులు అత‌డిని మంద‌లించారు. యువ‌తికి మ‌రొక‌రితో వివాహం నిశ్చ‌యించారు. విష‌యం తెలుసుకున్న స‌ద‌రు యువ‌కుడు.. యువ‌తి ఇంటిని త‌గ‌ల‌బెట్టాడు. ఈ ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లా జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ ఠాణా ప‌రిధిలోని బీజేఆర్‌న‌గ‌ర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. మ‌ల్లికార్జున‌న‌గ‌ర్ కాల‌నీ చెందిన న‌వీన్ పుడ్ డెలివ‌రీ బాయ్‌గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ యువ‌తిని పెళ్లి చేసుకుంటాన‌ని రెండు సంవ‌త్స‌రాలుగా వేదిస్తున్నాడు. అందుకు యువ‌తి త‌ల్లిదండ్రులు ఒప్పుకోక‌పోవ‌డంతో వారిని బెదిరించాడు. ఇటీవ‌ల యువ‌తి నాన్మ‌మ్మ‌కు అనారోగ్యంగా ఉండ‌డంతో సొంతూరుకు కుటుంబ స‌భ్యుల‌తో వెళ్లిన యువ‌తి అక్క‌డే ఉంటోంది. యువ‌తికి కుటుంబ స‌భ్యులు వేరే యువ‌కుడితో వివాహం నిశ్చ‌యించారు.

ఈ విష‌యం తెలుసుకున్న న‌వీన్ యువ‌తి బంధువుల‌ను బెదిరించి యువ‌తి ఇంటిని త‌గ‌ల‌బెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. ఈనెల 23న యువ‌తి ఇంటిపై పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇంటిలో ఉన్న వ‌స్తువులు అగ్నికి కాలి బూడిదఅయ్యాయి. స్థానికుల స‌మాచారం మేర‌కు అక్క‌డ‌కు చేరుకున్న యువ‌తి కుటుంబ స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు నిందితుడు న‌వీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story