ఓల్డ్‌ మలక్‌పేటలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల రీ-పోలింగ్‌ కొనసాగుతోంది. 69 కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ రీపోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 276 మంది అధికారులు పోలింగ్‌ విధుల్లో ఉన్నారు. రిటర్నింగ్‌ అధికారి సంధ్యారాణిని బాధ్యతల నుంచి తప్పించి ఆమె స్థానంలో శైలజను నియమిస్తూ ఎన్నికల అథారిటీ లోకేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల తర్వాత బ్యాలెట్‌ పత్రాల్లో గుర్తులు తారు మారు కావడంతో ఈసీకి ఫిర్యాదు చేశారు.

దీంతో ఎన్నికల సంఘం పోలింగ్‌ను నిలిపివేస్తూ ఆదేశించింది. మంగళవారం పోలింగ్‌ నిలిపివేసేసరికి 3450 మంది ఓటు వేశారు. వీరికి గురువారం ఎడమ చేతి చూపుడు వేలుకు కాకుండా మధ్య వేలికి సిరా చుక్క వేస్తున్నారు. రీపోలింగ్‌ సందర్భంగా ఆ ప్రాంత పరిధిలోని విద్యాసంస్థలు,ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు. 54,502 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

సుభాష్

.

Next Story